ఇప్పుడు టాలీవుడ్ ఆడియెన్స్ ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ పాన్ ఇండియా సినిమానే హరిహర వీరమల్లు. భారీ బడ్జెట్ తో దర్శకుడు జ్యోతి కృష్ణ అలాగే క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన ఈ ప్రాజెక్ట్ నుంచి ఇటీవల వచ్చిన ట్రైలర్ అంచనాలు పెంచింది. అయితే ఈ ట్రైలర్ లో హైలైట్ అయ్యిన అంశాల్లో పవన్ పై ఓ సాహిత్యం అభిమానులని సంగీత ప్రియులని ఎంతగానో ఆకట్టుకుంది.
‘సూర్యుడుకే కన్నుగప్పి సంచరించు యోధుడు..’ అంటూ సాగే ఈ లిరిక్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ పదాలు రాసింది ప్రముఖ సాహిత్య రచయితలో ఎవరో ఒకరు అనుకున్నారు కానీ కాదట. స్పెషల్ గా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ సాహిత్యాన్ని పవన్ కోసం రాసారని సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి రివీల్ చేశారు. ఇది మాత్రం ఫాన్స్ కి ఒకింత సర్ప్రైజ్ అని చెప్పొచ్చు.