‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఇంకా ఇంతే బాలన్స్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైనప్ లో ఉన్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు హరీష్ శంకర్ తో చేస్తున్న అవైటెడ్ చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్” కూడా ఒకటి. మంచి అంచనాలు ఉన్న ఈ సినిమా షూటింగ్ ఇపుడు ఫుల్ స్వింగ్ లో నడుస్తున్న సంగతి తెలిసిందే. మరి ఇలా ఉస్తాద్ భగత్ సింగ్ బాలన్స్ షూట్ పై లేటెస్ట్ క్లారిటీ వచ్చింది. ఈ సినిమాలో పవన్ పై షూటింగ్ కేవలం ఒక్క వారం మాత్రమే మిగిలి ఉన్నట్టుగా నిర్మాత నవీన్ తెలిపారు.

ఇక అలాగే మొత్తం ఇతర షూటింగ్ మరో 25 రోజుల్లో కంప్లీట్ చేసేయనున్నారట. దీనితో ఉస్తాద్ భగత్ సింగ్ కి గుమ్మడికాయ కొట్టేసినట్టే అని చెప్పవచ్చు. అలాగే రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది ప్రస్తుతానికి ఫిక్స్ చేయలేదని కూడా కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా ఈ శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version