వార్ 2, కూలీ చిత్రాలను భయపెడుతున్న సినిమా.. ఏమిటో తెలుసా?

war2-coolie

ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రెండు భారీ చిత్రాలు రిలీజ్‌కు రెడీ అయ్యాయి. ఇందులో బాలీవుడ్ బ్యానర్ యష్ రాజ్ ఫిల్మ్స్ నుంచి వస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘వార్ 2’ ఒకటి. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఈ సినిమాతో పాటు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ‘కూలీ’ కూడా ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్ కానుంది. అయితే ఇలాంటి పెద్ద సినిమాలను ఇప్పుడొక చిన్న సినిమా భయపెడుతోంది. అవును.. బెంగాల్‌లో ఈ రెండు సినిమాలకు అంతంత మాత్రమే క్రేజ్ ఉంది. కానీ, అక్కడ రిలీజ్ అవుతున్న ఓ చిన్న సినిమా ధూమ్ కేతు టికెట్ బుకింగ్స్‌లో దూసుకుపోతుంది. రెండు పెద్ద సినిమాలను పక్కకు నెట్టి ఈ చిత్ర టికెట్ బుకింగ్స్ జరగడమే దీనికి సాక్ష్యం.

అలా అని ఇది ఇటీవల తెరకెక్కిన సినిమా కాదు. పది సంవత్సరాల క్రితం షూటింగ్ మొదులుపెట్టుకుని 2017లో పూర్తి చేసుకుంది. అయితే, కొన్ని కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ కాలేదు. ఇక ఇప్పటికి ఈ సినిమానున రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. మరి ఈ ధూమ్ కేతు చిత్రం వార్ 2, కూలీ చిత్రాలకు ఎలాంటి పోటీనిస్తుందో చూడాలి.

Exit mobile version