రాజమౌళి ఎన్టీఆర్, చరణ్ లతో మల్టీ స్టారర్ ప్రకటించినప్పుడు టైటిల్ గా ఆర్ ఆర్ ఆర్ అని చెప్పడం జరిగింది. ఆ ముగ్గురి పేరులలోని మొదటి అక్షరాలను తీసుకొని త్రిపుల్ ఆర్ అని ప్రకటించారు. ఐతే ఇది సినిమాకు టైటిల్ గా పెట్టాలని రాజమౌళి భావించలేదు. సినిమాపై క్రేజ్ తీసుకురావడానికి జనాల్లోకి ఈజీగా వెళ్ళడానికి ఆయన ఆర్ ఆర్ ఆర్ ని వర్కింగ్ టైటిల్ గా పెట్టడం జరిగింది. ఐతే ఈ టైటిల్ బాగా జనాల్లోకి వెళ్లడంతో పాటు, పాన్ ఇండియా మూవీకి సరిపోయేలా యూనివర్సల్ గా ఉంది. అలాగే దేశవ్యాప్తంగా ఈ మూవీని కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఆర్ ఆర్ ఆర్ బాగానే ఉంది కదా మార్చడం ఎందుకు అన్నారు.
దీనితో మేము ఆర్ ఆర్ ఆర్ కే ఫిక్స్ అయ్యాము. కేవలం టైటిల్ కి రౌద్రం రణం రుధిరం అనే పూర్తి రూపం ఇచ్చాము. ఈ మూవీ అసలు టైటిల్ ఆర్ ఆర్ ఆర్ గానే ఉంటుందని రాజమౌళి తెలిపారు. ఇక ఈ చిత్రం కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రలను తీసుకొని కల్పితం జోడించి తెరకెక్కిస్తున్నాము అని చెప్పారు. ఆర్ ఆర్ ఆర్ 2021 జనవరి 8న, సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.