ఆర్ ఆర్ ఆర్ టెస్ట్ షూట్ అందుకే ఆపేశాం..!

రాజమౌళి సక్సెస్ ఫుల్ టీమ్ లో ఎప్పుడూ వినిపించే పేరు డి ఓ పి సెంథిల్ కుమార్. ఏళ్లుగా ఆయన రాజమౌళి సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. బాహుబలి లాంటీ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన చిత్రానికి సెంథిల్ కుమార్ పని చేయడం విశేషం. ఇక రాజమౌళి లేటెస్ట్ ప్రాజెక్ట్ ఆర్ ఆర్ ఆర్ కి ఆయనే డి ఓ పి గా ఉన్నారు. దీనితో ఆయనను ఆర్ ఆర్ ఆర్ గురించిన కొన్ని ఆసక్తికర విషయాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ టెస్ట్ షూట్ ఎందుకు ఆపేశారు అనేదానికి ఆయన ఆసక్తికర సమాధానం చెప్పారు.

లాక్ డౌన్ కి ముందు ఆర్ ఆర్ ఆర్ షూట్ లో కనీసం 500 నుండి 600 మంది సిబ్బంది పాల్గొనేవారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం దాన్ని 50 నుండి 60 తగ్గించాల్సి వచ్చింది. అయినా ప్రయత్నించి చూద్దాం అని టెస్ట్ షూట్ చేయాలని అనుకున్నాం. కానీ కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోవడంతో టెస్ట్ షూట్ చేయాలన్న నిర్ణయం వెనక్కి తీసుకోవడం జరిగింది, అన్నారు సెంథిల్ కుమార్. మరో రెండు మూడు నెలల్లో షూట్ మొదలవుతుందన్న ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు.

Exit mobile version