బన్నీ ఐకాన్ అందుకే లేటయ్యిందా?

వక్కంతం వంశీ డైరెక్షన్ లో వచ్చిన నాపేరు సూర్య పరాజయం తరువాత అల్లు అర్జున్ చాలా గ్యాప్ తీసుకున్నారు. ఆయన వద్దకు మొత్తం మూడు సినిమాలు వచ్చాయి. సుకుమార్, త్రివిక్రమ్ ల చిత్రాలలో పాటు దర్శకుడు వేణు శ్రీరామ్ కూడా ఐకాన్ మూవీ స్క్రిప్ట్ తో ఆయన్ని కలవడం జరిగింది. దాదాపు ఐకాన్ మూవీని ఒకే చేసిన అల్లు అర్జున్ ఎందుకో చివరి నిముషంలో కాదని త్రివిక్రమ్ మూవీకి కమిట్ అయ్యారు. త్రివిక్రమ్ తరువాతైనా వేణు శ్రీరామ్ తో ఆయన మూవీ చేస్తాడు అనుకుంటే, ఈసారి ఆయన సుకుమార్ కి ఓటేశాడు.

దీనితో వేణు శ్రీరామ్ పవన్ కళ్యాణ్ కం బ్యాక్ మూవీ వకీల్ సాబ్ కి కమిట్ అయ్యారు. ఐతే ఐకాన్ మూవీని బన్నీ లేట్ చేయడానికి కారణం ఏమిటనేది అర్థం కావడం లేదు. ఐకాన్ ఓ ప్రయోగాత్మక చిత్రం అని సమాచారం అందుతుంది. అందుకే అల్లు అర్జున్ ఈ సినిమా చేయడానికి ఇది కరెక్ట్ సమయం కాదని భావించి దానిని లేటు చేస్తున్నారని ఒక వాదన. ఐతే ఈ మూవీ క్యాన్సిల్ కాలేదు. సుకుమార్ మూవీ తరువాత బన్నీ చేసే మూవీ ఇదే.

Exit mobile version