మహేష్ మూవీ స్టోరీ లైన్ పై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్య

మహేష్ మూవీ స్టోరీ లైన్ పై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్య

Published on Apr 20, 2020 8:49 PM IST

రాజమౌళి రెండు రోజుల క్రితం మహేష్ మూవీ ప్రకటించారు. ఆయన ఆర్ ఆర్ ఆర్ తరువాత చేసే మూవీ మహేష్ తోనే ఉంటుందని స్పష్టత ఇచ్చారు. ఎన్నాళ్ళగానో ఎదురుచూస్తున్న కాంబినేషన్ కుదిరితే ఆ సినిమా స్టోరీ లైన్ ఏమై ఉంటుంది. ఈ జోనర్ లో వస్తుంది అనే అనుమానాలు, ఆసక్తి రేగడం సహజం. కాగా ఈ ప్రశ్నకు రాజమౌళి సమాధానం చెప్పడం జరిగింది. ఆయన ప్రకారం కేవలం మహేష్ తో సినిమా అనుకోవడమే తప్పా, కథ లేదా ఓ స్టోరీ లైన్ అనుకోలేదని చెప్పారు. ప్రస్తుతం లొక్డౌన్ కారణంగా రాజమౌళి ఇంటిలోనే ఉంటున్న నేపథ్యంలో స్టోరీ సిట్టింగ్స్ లో కూర్చుందామా అని వాళ్ళ నాన్నగారు విజయేంద్ర ప్రసాద్ అన్నారట.

కాబట్టి ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ మొదలయ్యే లోపు వీరి మధ్య కథా చర్చలు ఓ స్టోరీ లైన్ మహేష్ కోసం సిద్ధం చేస్తారేమో చూడాలి. మహేష్ మూవీ కథపై స్పష్టత వచ్చేది ఆర్ ఆర్ ఆర్ తరువాతనే అని రాజమౌళి పరోక్షంగా చెప్పేశారు. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ షూటింగ్ లాక్ డౌన్ కారణంగా వాయిదాపడింది. వచ్చే ఏడాది జనవరి 8న ఈ చిత్రం విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు