వాళ్ళందరినీ రాజమౌళి ఎలా సమీకరిస్తాడో?

వాళ్ళందరినీ రాజమౌళి ఎలా సమీకరిస్తాడో?

Published on May 12, 2020 7:08 PM IST

ఆర్ ఆర్ ఆర్ ని అద్భుతంగా తెరకెక్కించడం ఒక టాస్క్ అయితే షూటింగ్ పూర్తి చేయడం మరో టాస్క్ లా తరయారైంది. చాలా వరకు ఈ చిత్ర షూటింగ్ పూర్తి కాగా మిగిలిన 20-30 శాతం షూటింగ్ పూర్తి చేయాల్సివుంది. ప్రస్తుత పరిస్థితులలో ఇది ఏమంత ఈజీగా ఐపోయే పనికాదు. దానికి కారణం ఆర్ ఆర్ ఆర్ భారీ బడ్జెట్ మూవీ కావడంతో పదుల సంఖ్యలో సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. వీరందరూ అనేక ప్రాంతాలకు చెందినవారు . కొందరు విదేశాలకు చెందిన నిపుణులు కూడా ఈ సినిమాకు పని చేస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ హీరోయిన్ ఒలీవియా మోరిస్, విలన్స్ గా చేస్తున్న రే స్టీవ్సన్, అలిసన్ డూడి కూడా ఇతర దేశాలకు చెందినవారు.

ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుండగా వీరందిరిని సమీకరించి సినిమా పూర్తి చేయడం రాజమౌళి ముందున్న టఫ్ టాస్క్ అని చెప్పాలి. సాధారణ పరిస్థితులు ఏర్పడే వరకు ఆగే పరిస్థితి లేదు. ఇప్పటికే ఒకేసారి రాజమౌళి ఈ మూవీ విడుదల వాయిదా వేశారు. మరి ఈ విషయాన్ని రాజమౌళి ఎలా డీల్ చేస్తారో చూడాలి. ఎన్టీఆర్ కొమరం భీమ్ గా, చరణ్ అల్లూరి పాత్రలు చేస్తుండగా జనవరి 8న 2021లో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు