యాక్షన్ ఉన్నప్పటికీ ఎమోషన్స్ పీక్స్ అట..!

బాహుబలి తరువాత పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ వరుసగా భారీ చిత్రాలు చేస్తున్నారు. గత ఏడాది ఆయన అతిపెద్ద యాక్షన్ ఎంటరైనర్ సాహో తో పలకరించాడు. ఆ మూవీ ఫలితం ఎలా ఉన్నా, ప్రభాస్ కి మరికొంత క్రేజ్ వచ్చి చేరింది. దీనితో ఆయన నెక్స్ట్ మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. కాగా ప్రభాస్ ప్రస్తుతం రాధా కృష్ణ డైరెక్షన్ లో ఓ పీరియాడిక్ లవ్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ఐతే సెన్సిబుల్ లవ్ స్టోరీగా తెరక్కుతున్న ఈ మూవీలో ఎమోషన్ పీక్స్ లో ఉంటుందట. ప్యూర్ అండ్ సెన్సిబుల్ లవర్స్ గా కనిపించే ప్రభాస్, పూజల మధ్య కెమిస్ట్రీ సినిమాలో ప్రధాన ఆకర్షణ అట. ఇక పతాక సన్నివేశాలలో వచ్చే ఎమోషన్ సన్నివేశాలు ప్రేక్షకులకు కంట తడిపెట్టించడం ఖాయం అని అంటున్నారు. ప్రభాస్ డార్లింగ్ తరువాత ఓ పూర్తి స్థాయి లవ్ ఎంటర్టైనర్ తీస్తున్నారు. యాక్షన్ పాళ్ళు ఉన్నప్పటికీ ఎమోషన్స్ పీక్స్ అట ఈ మూవీలో..

Exit mobile version