ఎం ఎస్ రాజు దర్శకత్వంలో వస్తున్న ట్రెండీ చిత్రం డర్టీ హరి. ఎన్నో విజయవంతమైన చిత్రాలతో ఎందరో హీరో, హీరోయిన్ లను వెండితెరకు పరిచయం చేశారు నిర్మాత ఎంఎస్ రాజు. డర్టీ హరి చిత్రాన్ని ఎస్.పి.జి.పతాకం పై గూడూరు శివ రామకృష్ణ సమర్పణ లో గూడూరు సతీశ్ బాబు, గూడూరు సాయి పునీత్ నిర్మించారు. రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ డర్టీ హరి చిత్రం లో శ్రవణ్ రెడ్డి, సిమ్రత్ కౌర్, రుహని శర్మ లు హీరో హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ట్రైలర్ ను త్వరలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తాజాగా ప్రకటించారు.
ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు ఎం ఎస్ రాజు కేరాఫ్ అడ్రస్. శత్రువు, దేవి, మనసంతా నువ్వే, ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా అంటూ తెలుగు చిత్ర పరిశ్రమ కి ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించారు. అయితే నేటి యువతను దృష్టిలో పెట్టుకొని, రోటీన్ కి భిన్నంగా తెరకెక్కించిన చిత్రం ఈ డర్టీ హరి. ఇందులో కీలకంగా రెండు అంశాలను చూపించినట్లు తెలుస్తోంది. ఆటవికత్వం, విచక్షణా రహిత్యం వంటి అంశాల పై కథ ఉండనుంది. అయితే కఠోర వాస్తవాలను సున్నితంగా చూపిస్తూనే, వినోదాన్ని కూడా అద్బుతం గా చూపించినట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రం నిర్మాతలు గూడూరు సతీశ్ బాబు మరియు గూడూరు పునీత్ సాయి పునీత్ ఈ చిత్రం గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మా డర్టీ హరి చిత్ర నిర్మాణ అనంతర పనులు పూర్తి అయ్యాయి అని, ఈ చిత్రం లాక్ డౌన్ అనంతరం విడుదలకు సిద్దంగా ఉంది అని, అత్యున్నత నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని నిర్మించాం అని, త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు తెలిపారు.
నటీనటులు:
శ్రవణ్ రెడ్డి, సిమ్రత్ కౌర్, రుహాని శర్మ, రోషన్ బషీర్, అప్పాజీ అంబరీష్, సురేఖ వాణి, అజయ్, అజీజ్ నాజర్, మహేష్ తదితరులు.
సాంకేతిక విభాగం:
సంగీతం: మార్క్ కే రాబిన్
ప్రొడక్షన్ డిజైనర్ : భాస్కర్ ముదావత్
డీ.ఓ.పి: ఎం.ఎన్.బాల్ రెడ్డి
ఎడిటర్ : జునైద్ సిద్ధికి
సమర్పణ: గూడూరు శివ రామకృష్ణ
నిర్మాతలు: గూడూరు సతీశ్ బాబు, గూడూరు సాయి పునీత్
స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : ఎం.ఎస్ రాజు