నితిన్ సినిమాకు హీరోయిన్ ఫిక్సయ్యిందా?


మన టాలీవుడ్ స్టార్ హీరో నితిన్ ఇటీవలే ఒక ఇంటివాడైన సంగతి అందరికీ తెలిసిందే. అలాగే నితిన్ హీరోగా కూడా పలు ప్రాజెక్టులు కూడా ఇంకా హోల్డ్ లో ఉన్నాయి. అలా వాటిలో ఇంకా మొదలు కావాల్సి ఉన్న చిత్రం అంధధూన్ రీమేక్ కూడా ఒకటి. బాలీవుడ్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్రాన్ని తెలుగులో దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కించనున్నారు.

అయితే ఈ సినిమాకు సంబంధించి కూడా గత కొన్ని రోజుల నుంచి పలు కథనాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఓ కీలక రోల్ కు సీనియర్ నటి పరిగణలో ఉందని టాక్ వినిపించింది. అలాగే హీరోయిన్ విషయంలో కూడా కొన్ని వార్తలు వినిపించాయి. మొదటి నుంచీ వినిపిస్తున్న పేరునే ఈ చిత్రానికి ఫైనల్ చేసినట్టు ఇప్పుడు టాక్ వినిపిస్తుంది. తన మొదటి చిత్రంతోనే మన టాలీవుడ్ ఆడియెన్స్ లో మంచి ఇంప్రెషన్ కొట్టేసిన బ్యూటీ నభా నటేష్ పేరు ఫైనల్ అయ్యినట్టు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని నితినే నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version