‘అఖండ 2’ లో కూడా ఈ ఎలిమెంట్స్ పుష్కలంగా!

akhanda 2

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ “అఖండ 2 తాండవం” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో చేస్తున్న నాలుగో సినిమా ఇది కాగా సాలిడ్ హైప్ ఈ సినిమాపై నెలకొంది. ఇక రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులుకి మరిన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ బయటకి వస్తున్నాయి.

పార్ట్ 1 హిట్ అవ్వడానికి ఉన్న పలు కీలక కారణాల్లో అమ్మ సెంటిమెంట్ కూడా ఒకటి. మరి ఇదే ఎలిమెంట్ పార్ట్ 2 లో కూడా చాలా బాగుంటుందట. బోయపాటి మార్క్ ఎమోషన్స్ తో అమ్మ సెంటిమెంట్ ఎపిసోడ్స్ చాలా బాగా వచ్చినట్టు తెలుస్తోంది. వీటితో పాటుగా యాక్షన్ సీన్స్ కూడా అంతకు మించే ఉంటాయని తెలుస్తోంది. మొత్తానికి మాత్రం అఖండ 2 తో ఫ్యాన్స్ డిజప్పాయింట్ కారనే అనుకోవచ్చు.

Exit mobile version