‘సంబరాల ఏటి గట్టు’లో ఈ ఎలిమెంట్స్ కూడా?

sambarala

మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రమే ‘సంబరాల ఏటి గట్టు’. యువ దర్శకుడు రోహిత్ తెరకెక్కిస్తున్న ఈ సాలిడ్ యాక్షన్ డ్రామా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఇలా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్న ఈ సినిమాపై మంచి బజ్ కూడా ఉంది. అయితే కేవలం ఈ సినిమా ఒక రూరల్ యాక్షన్ డ్రామానే కాకుండా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కూడా కొన్ని ఉన్నట్టు ఇప్పుడు తెలుస్తుంది.

లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ చిత్రంలో మైథలాజి టచ్ కూడా ఉంటుంది అని వినిపిస్తుంది. మరి ఈ సినిమా మేకర్స్ నుంచి ఆల్రెడీ ఇదే టచ్ లో హను మాన్ వచ్చిన సంగతి తెలిసిందే. అది పెద్ద హిట్ అయ్యింది. ఇక ఈ సినిమాకి కూడా ఆ టాక్ వినిపిస్తుంది. మరి ఇదెలా డెలివర్ అవుతుందో వేచి చూడాల్సిందే. ఇక ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ వారు సాయి తేజ్ కెరీర్లోనే రికార్డు బడ్జెట్ ఈ సినిమాకి పెడుతున్నారు.

Exit mobile version