పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “ఓజి”. ఈ సినిమాకి కావాల్సిన హైప్ ని మేకర్స్ బాగానే అందుకున్నారు. అయితే ఈ పర్టిక్యులర్ చిత్రం కోసం మేకర్స్ చేసిన వినూత్న ప్రయత్నాలు కూడా చాలానే ఉన్నాయి.
అలా వన్స్ మోర్.ఐఓ (OnceMore.io) అనే సరికొత్త ప్లాట్ ఫామ్ ని ఈ సినిమాతో కొలాబరేషన్ అయ్యి రిజిస్ట్రేషన్ ఓపెన్ చేస్తే కేవలం 48 గంటల్లోనే ఏకంగా 1 మిలియన్ కి పైగా యూజర్స్ 60 దేశాల నుంచి రిజిస్టర్ అయ్యారట. దీనితో ఒక ఇండిపెండెంట్ ప్లాట్ ఫామ్ కి ఈ రేంజ్ లో రెస్పాన్స్ రావడం అనేది గ్లోబల్ రికార్డు అని ఇపుడు తెలుస్తుంది.
అలాగే ఇది చాట్ జిపిటి ఇంకా టిక్ టాక్ సహా ఇంస్టాగ్రామ్ లాంటి పాపులర్ ప్లాట్ ఫామ్స్ కి వచ్చిన కంటే ఎక్కువే అట. ఇలా మొత్తానికి మాత్రం ఓజి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చూపించిన రెస్పాన్స్ కి గ్లోబల్ రికార్డు వచ్చి పడింది అని చెప్పాలి. మరి ఇటీవల ఓజి సినిమాపై పలు కామిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయిగా అవి ఈ ప్లాట్ ఫామ్ నుంచి వచ్చినవే. మొత్తానికి సుజీత్ అండ్ టీం అనుకున్న విజన్ గట్టిగానే వర్కౌట్ అయ్యిందని చెప్పవచ్చు.