‘ఉస్తాద్ భగత్ సింగ్’లో ‘యుగానికి ఒక్కడు’ నటుడు సాలిడ్ రోల్

Ustaad-Bhagat-Singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీలీల అలాగే రాశి ఖన్నా హీరోయిన్స్ గా దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న సాలిడ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమే “ఉస్తాద్ భగత్ సింగ్”. మంచి హైప్ ని సెట్ చేసుకున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. మరి ఈ సినిమా మేకర్స్ లేటెస్ట్ గా ప్రముఖ నటుడు పార్తిబన్ కి బర్త్ డే విషెస్ చెబుతూ పోస్ట్ చేయడం మంచి ఇంట్రెస్టింగ్ గా మారింది.

తమిళ్ లో ‘యుగానికి ఒక్కడు’, రాక్షసుడు రీసెంట్ గా ఇడ్లీ కొట్టు తదితర చిత్రాల్లో సాలిడ్ పాత్రలు చేసిన ఈ టాలెంటెడ్ నటుడు ఉస్తాద్ భగత్ సింగ్ లో కూడా ఉన్నట్టుగా కన్ఫర్మ్ కావడం అనేది ఫ్యాన్స్ లో మరింత ఆసక్తి తీసుకొచ్చింది. మరి తాను ఈ సినిమాలో నెగిటివ్ రోల్ లోనే కనిపించేలా ఉన్నారని సెట్స్ నుంచి తన లుక్ చూస్తే అర్ధం అవుతుంది. మరి పవన్ తో సన్నివేశాలు ఎలా ఉంటాయో చూడాల్సిందే. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version