మొత్తం మూడు వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో సూపర్ స్టార్ మహేష్ బాబు అదిరిపోయే విజయాలను అందుకొని మహేష్ ఫ్యాన్స్ కు మంచి కిక్కిచ్చారు. ఇక ఇదే హవాను కొనసాగించాలని చాలా సస్పెన్సులు నిర్ణయాలు తర్వాత ఎట్టకేలకు దర్శకుడు పరశురామ్ తో ఒక ప్రాజెక్ట్ ను ఓకే చేసి లేట్ చెయ్యకుండా ప్రీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసేసి భారీ హైప్ ను తెచ్చేసుకున్నారు.
ఇదిలా ఉండగా మళ్ళీ ఈ మధ్యలోనే ఈ చిత్రానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలే వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు తగ్గ భారీ సెట్టింగులను చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందని విన్నాము. ఇప్పుడు అంతకు మించిన ఆసక్తికర అంశమే వినిపిస్తుంది. మహేష్ ఈ స్క్రిప్ట్ పై చాలా నమ్మకంగా ఉన్నారట. అందుకు తగ్గట్టుగా ఈ సినిమా స్క్రీన్ ప్లే ఈ సినిమాకే ప్రధాన హైలైట్ గా నిలవనున్నట్టు తెలుస్తుంది.
హీరో మరియు విలన్ నడుమ సాగే ఛాలెంజింగ్ మైండ్ గేమ్ ఎపిసోడ్స్ అద్భుతంగా ఉంటాయని వినికిడి. పరశురామ్ ఈ అంశాల్లో చాలా స్ట్రాంగ్ గా ఉన్నారట. ఈ ప్రాజెక్ట్ పై మాత్రం మహేష్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రస్తుత పరిస్థితులు చక్క దిద్దుకున్న అనంతరం ఈ చిత్రం షూటింగ్ మొదలు కానుంది.