ఇప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వరుస విజయ చిత్రాల దర్శకుడు పరశురామ్ తో తీస్తున్న మాస్ ఫ్లిక్ “సర్కారు వారి పాట”. జస్ట్ ప్రీ లుక్ పోస్టర్ తోనే మంచి హైప్ ను తెచ్చుకున్న ఈ చిత్రం ఇప్పుడిప్పుడే షూటింగ్ దిశగా అడుగులు వేస్తుంది. ఇదిలా ఉండగా దీని తర్వాత అలాగే రాజమౌళితో సినిమా కంటే ముందు మహేష్ ఎవరితో చేస్తారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.
అయితే మహేష్ లైన్ లో చాలా మంది దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి కానీ అస్సలు అసలైన దర్శకుని పేరే వినిపించకపోవడం గమనార్హం. నిజానికి మహేష్ నటించిన గత చిత్రం “సరిలేరు నీకెవ్వరు” తర్వాత తన హిట్ డైరెక్టర్ వంశీ పైడిపల్లితో ప్రాజెక్ట్ ఉండాల్సింది. కానీ అది కాస్త కొన్ని కారణాల మూలాన పక్కకు వెళ్ళింది. కానీ తర్వాత మాత్రం “సర్కారు వారి పాట” అనంతరం ఉంటుంది అని టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం అసలు ఈ దర్శకుని పేరే ఎందుకో వినిపించడం లేదు. మరి ఇందుకు గల అసలు కారణం ఏమిటి అన్నది తెలియాల్సి ఉంది.