‘బిగ్ బాస్” హౌస్ లో ఈ కంటెస్టెంట్ అసలు రంగులు.!

‘బిగ్ బాస్” హౌస్ లో ఈ కంటెస్టెంట్ అసలు రంగులు.!

Published on Nov 1, 2020 3:00 PM IST

మన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ షో నాలుగో సీజన్ సగానికి పైగా పూర్తయ్యిపోయింది. అలాగే ఇక ఎలిమినేషన్స్ మరియు గేమింగ్ కంటెస్టెంట్స్ నడుమ రచ్చ మరోస్థాయిలోకి వెళ్ళింది. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఎవరెవరు ఎలా ఉంటున్నారో అన్నది అంతా గమనిస్తూనే ఉన్నారు.

షో వీక్షకులకు కూడా అదే కావాల్సింది. మొదటి నుంచి ఒకలా ఉన్నవాళ్లు చివరి వరకు అలా ఉండని వాళ్ళని నోట్ చేస్తూనే ఉన్నారు. అలా ఓ కంటెస్టెంట్ తన అసలు రంగులు బయటపెట్టాడని నెటిజన్స్ మరియు షో ఫాలోవర్స్ అంటున్నారు. అతడు మరెవరో కాదు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్ లోకి వచ్చిన ముక్కు అవినాష్.

ఇటీవలే నోయెల్ ఆరోగ్యం బాగోక ఇంటి నుంచి బయటకు వచ్చిన అనంతరం అవినాష్ మరియు అమ్మ రాజశేఖర్ లపై చేసిన కామెంట్స్ కు గాను అవినాష్ ఇచ్చిన సమాధానాలు చూసి అంతా షాకయ్యారు. దీనితో ఇక్కడ అవినాష్ అసలు రంగు బయటపడ్డట్టు అయ్యింది. దీనితో ఇన్ని రోజులు హౌస్ లో మంచి గుడ్ విల్ తెచ్చుకున్న అవినాష్ దాన్ని పోగొట్టుకున్న వాడు అయ్యాడు.

తాజా వార్తలు