ఈ భారీ తెలుగు సినిమానే కోటా గారి ఆఖరి సినిమా!?

ఈ భారీ తెలుగు సినిమానే కోటా గారి ఆఖరి సినిమా!?

Published on Jul 13, 2025 2:31 PM IST

తెలుగు సినిమా గర్వించదగ్గ ఎందరో విలక్షణ నటుల్లో సీనియర్ నటుడు శ్రీ కోటా శ్రీనివాసరావు గారు కూడా ఒకరు. ఎలాంటి పాత్ర అయినా ఎలాంటి రసమైనా కూడా అవలీలగా పండించగలిగే కోటా శ్రీనివాసరావు గారు లేరు అనే మాట ఇప్పుడు తెలుగు సినిమాకి తీరని లోటు. అయితే నాలుగు దశాబ్దాలకి పైగా తెలుగు సినిమాకి సేవలందించిన కోటా శ్రీనివాసరావు గారి ఆఖరు సినిమా ఏంటి అనేది ఇపుడు తెలుస్తుంది.

తన చివరి స్క్రీన్ ప్రెజెన్స్ ఈ నెల లోనే రాబోతున్న భారీ చిత్రం “హరిహర వీరమల్లు” లోనే ఉండబోతుందట. తాను చిన్న కీలక పాత్ర ఈ సినిమాలో చేసినట్టుగా ఇపుడు తెలుస్తుంది. సో ఇదే ఆయనని తెరపై ఆఖరి సినిమాగా చూడడం అని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ వారు లేని లోటు తెలుగు సినిమాకి పూడ్చలేనిది. ఆయన అకాల మరణం పట్ల తెలుగు సినిమా ప్రముఖులు అంతా ఇపుడు విచారం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు