సెన్సేషనల్ హీరో ‘విజయ్ దేవరకొండ’ ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో చేస్తున్న సినిమా ‘లైగర్’ కొత్త షెడ్యూల్ షూట్ ఈ నెల 11 నుండి స్టార్ట్ కానుంది. అయితే, ఈ సినిమాలో హాస్యనటుడు అలీ కోసం పూరి ఒక అద్భుతమైన పాత్రను రాసినట్లు తెలుస్తోంది. ఈ స్టార్ కమెడియన్ పూరి చిత్రాలలో రెగ్యులర్ గా నటిస్తూనే ఉంటారు. మరి ఈసారి, లైగర్ లో ఆలీ అదిరిపోయే పాత్రను పోషిస్తున్నాడట. కాగా ఈ చిత్రాన్ని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు.
లైగర్ కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించిన కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మణంలో భాగస్వామి అయ్యాడు. ఇక విజయ్ దేవరకొండ చాల రోజులనుంచి బాలీవుడ్ సినిమా చేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. మరి ఈ సినిమా విజయ్ దేవరకొండకు ఎలాంటి హిట్ ను ఇస్తోందో చూడాలి. అలాగే ‘ఇస్మార్ట్ శంకర్’ ఇచ్చిన సక్సెస్ కిక్ తో ప్రస్తుతం పూరి ఈ సినిమాని చేస్తున్నాడు.