తిరువీర్ లేటెస్ట్ కామెడీ డ్రామా ‘ది గ్రేట్ వెడ్డింగ్ షో’ టీజర్ లాంచ్

వెర్సటైల్ యాక్ట‌ర్ తిరువీర్‌, టీనా శ్రావ్య హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. 7 పి.ఎం.ప్రొడ‌క్ష్స‌న్స్, ప‌ప్పెట్ షో ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్‌పై సందీప్ అగ‌రం, అస్మితా రెడ్డి బాసిని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాహుల్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. న‌వంబ‌ర్ 7న సినిమా రిలీజ్ కానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర టీజ‌ర్‌ను రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, సెన్సిబుల్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల రిలీజ్ చేశారు.

‘ప్రపంచానికి తెలియటం కంటే ముందే తిరువీర్ గురించి నాకు తెలుసు. తను కలల ప్రపంచంలో జీవించటాన్ని చూసి నేను సంతోషపడుతుంటాను. ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ టీజర్ చాలా ఆసక్తికరంగా చల్లటి గాలి మనసుని హత్తుకున్నట్లు ఉంది’ అని విజ‌య్ దేవ‌ర‌కొండ సోష‌ల్ మీడియాలో చిత్ర యూనిట్‌ని అభినందించారు.

టీజర్ ఆద్యంతం కామెడీతో సాగడం ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఈ సినిమాలో తిరువీర్ మరోసారి తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను మెప్పించడం ఖాయమని ఈ టీజర్ చూస్తే అర్థమవుతుంది. తిరువీర్, టీనా శ్రావ్య, మాస్టర్ రోహన్ యాక్టింగ్ ఆకట్టుకుంటోంది. సురేష్ బొబ్బిలి సంగీతం, నేపథ్య సంగీతం, కె.సోమ శేఖర్ సినిమాటోగ్రఫీ సినిమాకు ఎసెట్ కానున్నాయని ఈ టీజర్ చూస్తే అర్థమవుతుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version