కరోనా తీవ్రత పెరుగుతున్న ఈ తరుణంలో, మహమ్మారి మన దరికి చేరకుండా వైద్య సిబ్బంది మరియు పోలీసులు మరియు పారిశుద్ధ్య కార్మికులు మనకోసం పోరాడుతున్నారు. కాగా వారి గురించి వెంకటేష్ పోస్ట్ చేస్తూ.. ‘ఈ పోరాట సమయంలో పోలీసు విభాగం, పారిశుద్ధ్య విభాగం మరియు వైద్య సిబ్బంది నిజమైన వీరులుగా నిలిచారు. మన కోసం ప్రతిరోజూ వాళ్లలో ప్రతి ఒక్కరు అవిశ్రాంతంగా పనిచేస్తూ ప్రపంచవ్యాప్తంగా మన ఆరోగ్యం కోసం పోరాడుతూ ఉన్న ప్రతి ఫ్రంట్‌లైనర్‌కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. వారి ప్రయత్నాలకు మనం సాక్షిగా ఉండటం నన్ను మరింత వినయంగా చేస్తుంది. మనమందరం వారి ప్రయత్నాలను గుర్తించాలని మరియు వారి ప్రయత్నాల పట్ల మనం గౌరవ చిహ్నంగా ఉండాలని, ఈ కష్ట సమయం ముగిసిన తర్వాత మనందరం మంచి మానవులుగా బయటకు రావాలని నేను కోరుకుంటున్నాను’. అని వెంకటేష్ పోస్ట్ చేశారు.
ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ తన 74వ చిత్రంగా ‘నారప్ప’ సినిమాని చేస్తోన్న సంగతి తెలిసిందే. తమిళ్‌లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా సంచలనం సృష్టించిన ‘అసురన్’ చిత్రానికి ఇది రీమేక్. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి, వి క్రియేషన్స్ పతాకాలపై డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సామ్.కె నాయుడు, సంగీతం: మణిశర్మ, ‘ఎఫ్2’, ‘వెంకీమామ’ వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్‌తో వెంకీ దూసుకెళ్తోన్నారు.