మన స్టార్ హీరోస్ లో వారికి తగ్గ ఒక్క సరైన సినిమా పడితే చాలు దాని తాలూకా ఇంపాక్ట్ ఏ లెవెల్లో ఉంటుంది అనేది చాలా మందికి ఒక్కసారిగా క్లియర్ అవుతుంది. ఇలా ఇన్నాళ్ల పాటు రీమేక్ లు చేస్తూనే భారీ రికార్డులు సెట్ చేసిన పవన్ కళ్యాణ్ కి ఒక్క సరైన సినిమా, కాంబినేషన్ పడితే ఎలా ఉంటుందో ఎట్టకేలకి ఇప్పుడు “ఓజి” తో ప్రూవ్ అయ్యింది.
యంగ్ దర్శకుడు సుజీత్ తో చేసిన ఈ స్పెషల్ ప్రాజెక్ట్ ఓపెనింగ్స్ పై చాలా మంది కళ్ళు ఉన్నాయి. అయితే ఇది వరకు పవన్ సినిమాలకి అఫీషియల్ నంబర్స్ వచ్చింది లేదు. కానీ చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ “ఓజి” కి మొదలైంది. ఇలా మేకర్స్ వరల్డ్ వైడ్ ఓజి కొట్టిన దెబ్బ తాలూకా వసూళ్లు అనౌన్స్ చేశారు. మరి ఈ సినిమా ఊహించిన విధంగానే ఈ ఏడాదిలోనే హైయెస్ట్ గ్రాసర్ ఓపెనింగ్స్ కొల్లగొట్టిన సినిమాగా నిలిచి హిస్టరీ క్రియేట్ చేసింది.
భారీ అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం మొదటి రోజు ఏకంగా 154 కోట్ల గ్రాస్ ని అందుకున్నట్టుగా మేకర్స్ సాలిడ్ పోస్టర్ తో అనౌన్స్ చేశారు. దీనితో పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే కాకుండా మన సౌత్ సహా ఇండియన్ సినిమా హిస్టరీ లోనే ఒక రికార్డు ఓపెనర్ గా ఓజి చిత్ర నిలిచింది. తనకి ఒక్క సరైన సినిమా పడితే ఎలా ఉంటుందో పవన్ స్టామినా ఏంటి అనేది ఇపుడు ఓజి చూపించింది అని చెప్పవచ్చు.