సంక్రాంత్ రేస్ లో ఈ రెండు క్రేజీ ప్రాజెక్టులు.!

మన టాలీవుడ్ లో ఏదన్నా పండుగ వస్తుంది అంటే సినీ అభిమానులకు ఆరోజు రెండు పండుగలతో సమానం. ప్రతీ స్పెషల్ అకేషన్ కు వచ్చే సినిమాల కోసం ఎదురు చూసే వాళ్ళు అనేకం. కానీ ఈ ఏడాది నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల మూలాన కేవలం అదే సంక్రాంతికి తప్ప మరే ఇతర పెద్ద పండుగకు కూడా సినిమాలు విడుదల లేకుండా పోయాయి.

దాదాపు ఆరు నెలలు థియేటర్స్ మూతపడి ఉండడం ప్రపంచ సినీ చరిత్రలోనే ఎప్పుడూ జరగలేదు. కానీ కాలం గడుస్తున్నా కొద్దీ పరిస్థితులు మారడంతో థియేటర్స్ కూడా తెరుచుకునే సూచనలు వస్తుండడంతో అప్పుడే పలు చిత్రాలు తమ సినిమాలను రెడీ చేస్తున్నారు. ఇక ఈ ఏడాది సంక్రాంతి అయ్యిపోవడంతో అప్పుడే వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ కు రెండు క్రేజీ ప్రాజెక్టులు రెడీ అయ్యిపోతున్నట్టు సమాచారం.

వాటిలో ఒకటి నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న “లవ్ స్టోరీ” కాగా మరొకటి మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న మాస్ కాప్ డ్రామా “క్రాక్” అన్నట్టు తెలుస్తుంది. ఈ రెండు చిత్రాలు కూడా దాదాపు 90 శాతం షూట్ ను పూర్తి చేసుకున్నవే పైగా ఇప్పుడు మిగతా షూట్ ను కూడా పూర్తి చేసుకోబోతుండడంతో సంక్రాంతికే ఈ రెండు చిత్రాలు కూడా విడుదల చెయ్యాలని మేకర్స్ భావిస్తున్నారట.

Exit mobile version