మంచి యూత్‌ఫుల్ లవ్ స్టోరీకి, ఫాదర్ ఎమోషన్, మిడిల్ క్లాస్ టచ్ ఇస్తే ఎలా ఉంటుందో ‘బ్యూటీ’ సినిమా చూపించబోతోంది. అంకిత్ కొయ్య, నీలఖి జంటగా వానర సెల్యూలాయిడ్, మారుతీ టీం ప్రొడక్ట్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘బ్యూటీ’. గీతా సుబ్రమణ్యం, హలో వరల్డ్, భలే ఉన్నాడే ఫేమ్ జె.ఎస్.ఎస్. వర్ధన్ మాటలు, దర్శకత్వం వహించిన ‘బ్యూటీ’ చిత్రాన్ని అడిదాల విజయపాల్ రెడ్డి, ఉమేష్ కుమార్ బన్సాల్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లేని ఆర్.వి. సుబ్రహ్మణ్యం అందించారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు, గ్లింప్స్, పాటలు ఇలా అన్నీ కూడా అంచనాలు పెంచేశాయి.
తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. ఇక ఈ ఎమోషనల్ టీజర్ ఆడియెన్స్‌ను కదిలించేలా ఉంది. ఇక ఈ టీజర్‌లో విజయ్ బుల్గానిన్ ఆర్ఆర్ అందరినీ కదిలించేలా ఉంది. శ్రీ సాయి కుమార్ దారా ఇచ్చిన విజువల్స్ ఎంతో బ్యూటీఫుల్‌గా ఉన్నాయి.
ఆయ్, మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం వంటి హిట్ చిత్రాల్లో తనదైన మార్క్ క్రియేట్ చేసుకున్న అంకిత్ కొయ్య ‘బ్యూటీ’ చిత్రంతో ఆకట్టుకునేలా ఉన్నారు. చూస్తుంటే చాలా ఇంటెన్స్ ఉన్న పాత్రను పోషించినట్టుగా కనిపిస్తోంది. ఇక ఈ చిత్రంలో నరేష్, వాసుకి, నంద గోపాల్, సోనియా చౌదరి, నితిన్ ప్రసన్న, మురళీ గౌడ్, ప్రసాద్ బెహరా వంటి వారు పోషించిన పాత్రలకు మంచి ఇంపార్టెన్స్ ఉందని అర్థం అవుతోంది.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్‌గా శ్రీ సాయి కుమార్ దారా పని చేశారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్షన్: బేబీ సురేష్ భీమగాని, ఎడిటింగ్: ఎస్‌బి ఉద్ధవ్. ఈ ఏడాదిలో రాబోతోన్న క్రేజీ ప్రాజెక్టుల్లో ‘బ్యూటీ’ కూడా ఒకటి కానుంది. ఈ సినిమాకు బి.ఎస్. రావు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయి. సెప్టెంబర్ 19న ఈ మూవీని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు.