మెగా158 కోసం బాబీ వేట మొదలుపెట్టాడా..?

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా నిన్న(ఆగస్టు 22) ఆయన నటిస్తున్న సినిమాలకు సంబంధించి వరుస అప్డేట్స్‌తో ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ అందించారు. ఇక ఈ క్రమంలోనే తన కెరీర్‌లో 158వ చిత్రానికి సంబంధించిన అప్డేట్ కూడా మేకర్స్ ఇచ్చారు.

దర్శకుడు బాబీ కొల్లి డైరెక్షన్‌లో చిరు మరోసారి సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. గతంలో ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత బాబీతో సినిమా చేసేందుకు చిరు ఆసక్తిని చూపారు. దీంతో ఇప్పుడు వీరిద్దరి కాంబోలో మెగా 158 అనే ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమాను పూర్తి యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించనున్నారు.

అయితే, ఈ సినిమాలోనూ బాబీ ‘వాల్తేరు వీరయ్య’ ఫార్ములా రిపీట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కూడా మరో యంగ్ హీరో నటించబోతున్నాడని.. ఈ పాత్ర కోసం సరైన హీరోని ఓకే చేసే పనిలో బాబీ ఉన్నట్లు సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. వాల్తేరు వీరయ్య చిత్రంలోనూ మాస్ రాజా రవితేజ సాలిడ్ పాత్రలో నటించి ఆ సినిమాకు బూస్ట్ ఇచ్చాడు. మరి ఈసారి బాబీ ఏ హీరోను పట్టుకొస్తాడో చూడాలి.

Exit mobile version