ఈ రోజు ఈ ఇద్దరు కంటెస్టెంట్స్ డేంజర్ జోన్ లో?

ఈ రోజు ఈ ఇద్దరు కంటెస్టెంట్స్ డేంజర్ జోన్ లో?

Published on Nov 14, 2020 11:01 AM IST

ప్రస్తుతం మన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ సీజన్ 4 మరింత ఎంటర్టైన్మెంట్ తో దూసుకుపోతుంది. అలాగే డీసెంట్ టీఆర్పీ ను తెచ్చుకుంటున్న ఈ గ్రాండ్ షోకు మేకర్స్ మరింత స్పైసీను యాడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు సగం దాటేసిన ఈ షో మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతుంది.

అలాగే ఈ రోజు దీవాళీతో పాటుగా వీకెండ్ కావడంతో ఎలిమినేషన్ కూడా ఉంటుందన్న సంగతి తెలిసిందే. మరి ఈరోజు ఇద్దరికీ డేంజర్ బెల్స్ ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ ఈ వారం నామినేషన్స్ లో ఉండగా వీరిలో మెహబూబ్ మరియు అరియనాలు డేంజర్ జోన్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

వీరు మాత్రమే అతి తక్కువ వోటింగ్ తో దిగువ స్థానంలో ఉన్నారని సమాచారం. మరి ఈ దీవాళీ స్పెషల్ అండ్ మెగా ఎపిసోడ్ లో డేంజర్ జోన్ లో ఉన్నది వీరేనా కాదా అన్నది చూడాలి. ఇక్కడ మెగా ఎపిసోడ్ అని ఎందుకు అన్నాం అంటే ఈ ఎపిసోడ్ లో కింగ్ నాగ్ తో పాటు అయన తనయుడు నాగ చైతన్య కూడా స్టేజ్ పై కనిపించనున్నాడని ఇది వరకే తెలిపాము. సో ఈ ఎపిసోడ్ మరింత స్పెషల్ గా ఉండనుంది.

తాజా వార్తలు