‘కూలీ’లో ఆ ఇద్దరు వెరీ స్పెషల్.. ఫిదా అవుతున్న ప్రేక్షకులు..!

COOLIE Rajinikanth

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘కూలీ’ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో పలువురు స్టార్స్ నటిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మోత మోగిస్తుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అయితే, ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు ఇందులో నటించిన అక్కినేని నాగార్జున, సత్యరాజ్, శ్రుతి రాజ్, అమీర్ ఖాన్, ఉపేంద్ర వంటి స్టార్‌లను కాదని మరో ఇద్దరు యాక్టర్స్‌ను చూసి థ్రిల్ అవుతున్నారు. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరో తెలుసా..? ‘‘మోనిక..’’ పాటలో తనదైన ఎనర్జిటిక్ స్టెప్పులతో ఊపేసిన సౌబిన్ షాహిర్ ఈ సినిమాలో నటించిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఆయన చేసిన యాక్షన్‌కు ఆడియన్స్ మంత్రముగ్ధులవుతున్నారు.

ఇక ఆయనతో పాటు మరో ఇంట్రెస్టింగ్ పాత్రలో నటించిన నటి రచిత రామ్ పర్ఫార్మెన్స్ కూడా హాట్ టాపిక్‌గా మారింది. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు ఆమె చూపెట్టిన ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తోంది. సోషల్ మీడియాలో వీరిద్దరి పాత్రలకు భారీగా అభినందనలు తెలుపుతున్నారు కూలీ చూసిన ప్రేక్షకులు.

Exit mobile version