ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ పలు ఇంట్రెస్టింగ్ చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ఇందులో పలు సినిమాలు వేసవి కానుకగా రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ఇక మరికొన్ని చిత్రాలు వేసవి తర్వాత రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. అయితే, జూలై నెలలో చాలా వరకు పెద్ద హీరోలు తమ సినిమాలను రిలీజ్ చేయరు. కానీ, ఈసారి జూలై నెలలో ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు భారీ చిత్రాలు రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ భారీ వీఎఫ్ఎక్స్తో రూపొందుతోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని జూలై 24న రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. అయితే, ‘భోళాశంకర్’ ఫ్లాప్ తర్వాత చిరు ఈ సినిమాతో సాలిడ్ హిట్ అందుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.
అటు మాస్ రాజా రవితేజ కూడా తన లేటెస్ట్ మూవీ ‘మాస్ జాతర’ను జూలై 18న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న రవితేజ కూడా ఈ సినిమాతో గట్టి కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.
ఇక మరో హీరో నితిన్ కూడా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల తర్వాత తన నెక్స్ట్ మూవీ ‘తమ్ముడు’తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాను దర్శకుడు వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తుండగా జూలై 4న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
మరి ఈ ముగ్గురు హీరోలు జూలైలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.