తారక్ “భీం” టీజర్లో ఇవే మెయిన్ హైలైట్ అట.!

తారక్ “భీం” టీజర్లో ఇవే మెయిన్ హైలైట్ అట.!

Published on Oct 14, 2020 7:04 PM IST

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు కొమరం భీంగా తమ అభిమాన హీరో ఎలా ఉంటాడా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే దర్శకుడు రాజమౌళి తాను తీస్తున్న “రౌద్రం రణం రుధిరం” లో తారక్ తో పాటుగా చరణ్ ను కూడా చూపించనున్నారు. అయితే ఇప్పటికే అల్లూరిగా చరణ్ ను ఓ రేంజ్ లో చూపించిన జక్కన తారక్ ను చూపించాల్సిన సమయం వచ్చింది. ఈ అక్టోబర్ 22 న ప్లాన్ చేసిన ఈ భారీ టీజర్ కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.

ఈ టీజర్ లో రామ్ చరణ్ వాయిస్ ఓవర్ ఎలాగో ఉంటుంది అన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ అంతకు మించే అంశాలను కూడా రాజమౌళి యాడ్ చేశారట. తారక్ పై కొన్ని స్లో మోషన్ షాట్స్ ను అత్యద్భుతంగా తెరకెక్కించి ఇందులో పెట్టినట్టు తెలుస్తుంది. అలాగే చరణ్ వాయిస్ ఓవర్ తో తారక్ ను ఎలివేట్ చేసే షాట్స్ మరింత బాగుంటాయట. మొత్తానికి మాత్రం జక్కన్న ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నారు. మరి ఈ సాలిడ్ టీజర్ ఎలా ఉందో తెలియాలి అంటే ఈ అక్టోబర్ 22 వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు