చరణ్ ను ఈ దర్శకులు ఇంప్రెస్ చేసారా?

ఇప్పుడు మన టాలీవుడ్ లో మొత్తం మన స్టార్ హీరోలు అంతా తమ ఫ్యూచర్ ప్రాజెక్టులతో ఆల్రెడీ తమ ప్లానింగ్ ను మొదలు పెట్టేసారు. కానీ రామ్ చరణ్ మాత్రమే ఇంకా ఏ ప్రాజెక్ట్ ను కన్ఫర్మ్ చెయ్యలేదు. ఇంకా స్క్రిప్ట్స్ ను ఎంచుకునే పనిలోనే ఉన్న చరణ్ ప్రస్తుతానికి రెండు భారీ ప్రాజెక్టులలో కనిపించనున్నారు. ఇక వీటి తర్వాత మాత్రం చరణ్ లైనప్ లో ఇద్దరు వైవిధ్య దర్శకులు ఉన్నారని టాక్ వినిపించింది.

అయితే ఈ ఇద్దరు దర్శకులు చెప్పిన లైన్స్ కూడా చరణ్ ను ఇంప్రెస్ చేసినట్టు వినికిడి. మరి ఇంకా దీనిపై సరైన సమాచార రావాల్సి ఉంది. అలాగే చరణ్ ఏ దర్శకునితో తన తర్వాతి ప్రాజెక్ట్ కూడా ఎవరితో మొదలు పెడతారు అన్నది హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం చరణ్ రాజమౌళితో తీస్తున్న RRR కన్నా ముందు కొరటాల మరియు మెగాస్టార్ చిరుతో చేయనున్న “ఆచార్య” షూటింగ్ లో పాల్గొననున్నారు.

Exit mobile version