అందులో నిజం లేదంటున్న అనుష్క

anushka

ప్రస్తుతం టాలీవుడ్ లో రెండు భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తూ బాగా బిజీ బిజీ గా ఉన్న హీరోయిన్ అనుష్క. ఆమె ఒకేసారి ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ అనే రెండు పీరియడ్ డ్రామా సినిమాల్లో నటిస్తోంది. దాదాపు హీరోలతో సమానంగా పేరు తెచ్చుకున్న అనుష్క కోసం ఎంతో మంది లేడీ ఓరియెంటెడ్ కథలని ప్రిపేర్ చేస్తున్నారు, అలాగే నిర్మాతలు కూడా అనుష్కతో భారీ బడ్జెట్ పెట్టి సినిమా తీయడానికి ఏమాత్రం వెనకాడటం లేదు.

ఇదే విషయాన్ని అనుష్క ముందు ఉంచితే ‘ నిర్మాతలు నన్ను నమ్ముకొని భారీ బడ్జెట్ పెట్టి సినిమాలు చేస్తారనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే అలాంటి సినిమాలు చేయాడానికి కథే కీలకం. ఎంతపెద్ద స్టార్స్ ఉన్నా కథ లేకపోతే సినిమా వృధా అవుతుంది. కావున కేవలం నన్ను నమ్మి కొన్ని కోట్లు పెట్టి సినిమా చేస్తున్నారనడంలో నిజం లేదు. శ్యాం ప్రసాద్ రెడ్డి గారు నన్ను నమ్మి అరుంధతి సినిమా చేయలేదు. కథను నమ్మి ఆ కథకు నన్ను ఎంచుకున్నారు. కావున ఏ సినిమాకైనా కథే ముఖ్యంమని’ అనుష్క సమాధానం ఇచ్చింది.

Exit mobile version