ఆగస్టు 9 సూపర్ స్టార్ మహేష్ బర్త్ డే. మహేష్ బర్త్ డే భారీ ఎత్తున్న నిర్వహించాలని ఇప్పటికే ఫ్యాన్స్ అనేక ప్లాన్స్ తో ఉన్నారు. కరోనా కారణంగా భౌతికంగా వేడుకలు నిర్వహించలేకపోయినా సోషల్ మీడియాలో రచ్చ చేయాలని డిసైడ్ అయ్యారు. మహేష్ బర్త్ డే విషెస్ యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియా రికార్డ్స్ క్రియేట్ చేయాలనీ సంకల్పంతో ఉన్నారు. ఐతే మహేష్ నుండి మాత్రం ఆరోజు ఫ్యాన్స్ కి ఎటువంటి అప్డేట్ ఉండదని సమాచారం అందుతుంది.
మహేష్ లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట అప్డేట్ మార్చి 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజున ఇవ్వడం జరిగింది. ఇక సర్కారు వారి పాట మూవీ నుండి ఎటువంటి అప్డేట్ ఉండకపోవచ్చు. దానికి కారణం సర్కారు వారి పాట మూవీ అధికారిక ప్రకటన అయితే జరిగింది కానీ షూటింగ్ మొదలుకాలేదు. కావున మహేష్ నుండి ఫ్యాన్స్ కోసం ఆరోజు అప్డేట్ ఉండకపోవచ్చు. సర్కారు వారి పాట మూవీని దర్శకుడు పరుశురాం తెరకెక్కిస్తుండగా, కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.