కరోనా వైరస్ కారణంగా తీవ్రంగా దెబ్బ తిన్న పరిశ్రమలలో సినిమా పరిశ్రమ ఒకటి. బడా సినిమాల విడుదల ఇప్పటికే నిలచిపోగా ఆల్రెడీ విడుదలైన సినిమాలకు టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ పడిపోయాయి. షూటింగ్ షెడ్యూల్స్ కొరకు ఇతర దేశాలు వెళ్లడం పూర్తిగా నిలిచిపోయింది . అలాగే భారత్ లో కూడా కొన్ని రాష్ట్రాలలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో త్వరలో పూణే షెడ్యూల్ నందు ఆర్ ఆర్ ఆర్ టీమ్ పాల్గొనాల్సివుంది.
ఇలాంటి పరిస్థితులలో అనుకున్న ప్రకారం చిత్ర యూనిట్ అక్కడ షూటింగ్ నిర్వహిస్తారా లేదా అనేది సందిగ్ధంగా మారింది. అలాగే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు మునుపటి వలే అన్ని ప్రదేశాలలో ఇవ్వకపోవచ్చు. వందల మంది స్టాఫ్ పాల్గొనే ఆర్ ఆర్ ఆర్ లాంటి భారీ సినిమాల షూటింగ్స్ లో సరైన భద్రతా నియమావళి పాటించకుండా షూటింగ్ జరిగితే ఎవరో ఒకరికి ఉన్నా అది వ్యాప్తి చెందే అవకాశం కలదు. మరి ఇలాంటి విపత్కర పరిస్థితులలో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ సవ్యంగా సాగుతుందా? చెప్పినట్లుగా ఆర్ ఆర్ ఆర్ 2021కి విడుదల అవుతుందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.