బాలీవుడ్ బడా దర్శక నిర్మాత కరణ్ జోహార్ విజయ్ ని వదిలేలా లేడు. జయాపజయాలతో సంబంధం లేకుండా విజయ్ మూవీస్ ని ఆయన దక్కించుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే కరణ్ జోహార్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ మూవీ హిందీ రీమేక్ హక్కులను దక్కించుకున్నారు. తాజా సమాచారం ప్రకారం కరణ్ ఇటీవల విడుదలైన వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ హక్కులను సైతం కొనుగోలు చేశారట. వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ పరాజయం పొందినప్పటికీ కరణ్ ఎందుకు ఆ మూవీ హక్కులను కొనుగోలు చేశాడన్నది అర్థం కాలేదు.
ఇక దర్శకుడు పూరి జగన్నాధ్ దేవరకొండతో చేస్తున్న మూవీలో కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. అంత పెద్ద దర్శక నిర్మాత కరణ్ విజయ్ దేవరకొండపై అంత ఆసక్తి ఎందుకు చూపిస్తున్నాడు అనేది అంతుపట్టని విషయం. ఇక పూరి సినిమాలో విజయ్ ఫైటర్ గా కనిపిస్తుండగా, అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.