‘కాంతార’తో నో ‘రాజా సాబ్’ ట్రీట్!

‘కాంతార’తో నో ‘రాజా సాబ్’ ట్రీట్!

Published on Oct 4, 2025 1:58 PM IST

Raja Saab kantara

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో అదరగొడుతున్న అవైటెడ్ చిత్రమే “కాంతార 1”. నటుడు దర్శకుడు రిషబ్ శెట్టి హీరోగా నటించిన ఈ సినిమా థియేటర్స్ లో భారీ బుకింగ్స్ తో విజయవంతంగా కొనసాగుతుంది. అయితే ఈ చిత్రం విషయంలో మాత్రం ప్రభాస్ అభిమానులు ఒకింత డిజప్పాయింట్ గా ఉన్నారని చెప్పాలి. ఈ సినిమా థియేటర్స్ లో ది రాజా సాబ్ ట్రైలర్ ని కూడా యాడ్ చేస్తామని ఇది వరకే మేకర్స్ చెప్పారు.

కానీ సీన్ కట్ చేస్తే చాలా వరకు కాంతార 1 థియేటర్స్ లో అసలు రాజా సాబ్ ట్రైలర్ ప్రదర్శితమే కాలేదు. దీనితో ఈ ఒక్క అంశంలో మాత్రం డార్లింగ్ ఫ్యాన్స్ బాగా నిరాశ చెందారని చెప్పాలి. మరి కాంతార 1 తో అటాచ్ చేస్తామన్న ట్రైలర్ ఎందుకు ప్లే చేయడం లేదు అనేది మేకర్స్ కే తెలియాల్సి ఉంది. ఇక ది రాజా సాబ్ ని మారుతీ దర్శకత్వం వహిస్తుండగా వచ్చే ఏడాది జనవరి 9న రిలీజ్ కి తీసుకొస్తున్నారు.

తాజా వార్తలు