మా మధ్య నెంబర్ వన్ గేమింగ్ లేదంటున్న మెగా హీరో

మా మధ్య నెంబర్ వన్ గేమింగ్ లేదంటున్న మెగా హీరో

Published on Apr 2, 2013 1:40 AM IST

Iddarammailatho11
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘తుఫాన్’ మూవీ ఫస్ట్ లుక్ ట్రైలర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. అలాగే రేపు రామ్ చరణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన ఓ ప్రముఖ పత్రికతో ముచ్చించిన ఇంటర్వ్యూ లో వరుసగా విజయాలను అందుకుంటున్నారు. ప్రస్తుతం మన ఇండస్ట్రీలో నెంబర్ వన్ ఎవరని అనుకుంటున్నారు? అని అడిగితే చరణ్ సమాధానమిస్తూ ‘ బాలీవుడ్లో అయితే మీరనే నెంబర్ వన్ స్థానం కోసం పోటీ జరుగుతోంది, అది కూడా ఇద్దరు బడా హీరోల మధ్య జరుగుతోంది. ఆ నెంబర్ వన్ గోల మన ఇండస్ట్రీలోలేదు. అందరం కలిసి ఫ్రెండ్లీగా పనిచేసుకుంటున్నాం. ఇప్పుడున్న యంగ్ జెనరేషన్ లోనే కాదు మా నాన్నగారి రోజుల్లో కూడా బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునల మధ్య కూడా ఆ భావన లేదు. వారిలాగే మా యంగ్ జెనరేషన్ మధ్య కూడా నెంబర్ వన్ గేమ్ లేదని’ అన్నాడు.

రామ్ చరణ్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి ‘ఎవడు’, అపూర్వ లిఖియా ‘తుఫాన్’ సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలు కొద్ది గ్యాప్ లో సమ్మర్లోనే విడుదల కానుండడం విశేషం. ఈ సమ్మర్ మెగా అభిమానులకు పెద్ద పండుగనే చెప్పుకోవాలి.

తాజా వార్తలు