టాలీవుడ్ టాప్ స్టార్ గా ఉన్న మహేష్ పై రెండు రోజులుగా ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతుంది. అదేమిటంటే ఈ ఏడాది ప్రసారం కానున్న బిగ్ బాస్ సీజన్ 4కి ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారంట. బిగ్ బాస్ షో నిర్వాహకులు ఈ విషయం గురించి మహేష్ తో కూడా చర్చలు జరిపినట్లు సదరు వార్తల సారాంశం. ఐతే మిత భాషి, ఇలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉండే మహేష్ బిగ్ బాస్ రియాలిటీ షో కి వ్యాఖ్యాతగా అంగీకరించే అవకాశాలు చాలా తక్కువ.
అలాగే ఆయన ఒక వేళ ఈ షో చేయడానికి అంగీకరించినప్పటికి రెమ్యూనరేషన్ భారీగా ఉండే అవకాశం కలదు. మహేష్ డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్ షో నిర్వాహకులు ఇవ్వగలరా అనేది పాయింట్. ఐతే ఈ గాసిప్ లో నిజం లేదని తెలుస్తున్న సమాచారం. బిగ్ బాస్ సీజన్ 4కి సైతం నాగార్జున హోస్ట్ గా వ్యవహరించే అవకాశం కలదు. మరి చూడాలి ఈ సీజన్ కి ఎవరు బుల్లి తెరపై అలరిస్తారో.