పవన్ ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ కన్ఫర్మ్ లానే ఉంది.!


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా తన సినిమాలపై నెక్స్ట్ మూవీ ఎలా ఉండనుందో ఒక పర్టిక్యులర్ క్లారిటీ ఇచ్చేసారు. ఇదిలా ఉండగా తన లైన్ లో ఉన్న పలు ప్రాజెక్టులలో దర్శకుడు శ్రీరామ్ వేణుతో తీసిన “వకీల్ సాబ్” అలాగే క్రిష్ జాగర్లమూడి తో తీస్తున్న భారీ పీరియాడిక్ డ్రామా కూడా కొంతవరకు పూర్తయ్యింది. అయితే వీటిలో వకీల్ సాబ్ నుంచి అధికారిక అప్డేట్ ద్వారా సాంగ్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చింది కానీ ఎలాంటి టీజర్ ఇంకా రాలేదు.

అయితే ఈ సినిమా టీజర్ సహా క్రిష్ తో చేస్తున్న ప్రాజెక్ట్ తాలూకా ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చే సెప్టెంబర్ 2 న పవన్ పుట్టినరోజు సందర్భంగా వచ్చే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపించింది. అయితే అప్పటికి అది టాకే అయినా ఇప్పుడు ఆ టాక్ మరింత బలపడుతుంది. అదే రోజున వకీల్ సాబ్ టీజర్ మరియు క్రిష్ తో సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. సో పవన్ ఫ్యాన్స్ ను డబుల్ ట్రీట్ కన్ఫర్మ్ అయ్యేలా ఉందనే చెప్పాలి.

Exit mobile version