ఈ నెల 25న తెలిసీ తెలియక ఆడియో

“తెలిసీ తెలియక” అనే పేరుతో ఒక చిత్రం రానుంది గీతానంద్, మైథిలి ప్రధాన పాత్రలలో రానున్న ఈ చిత్రాన్ని కే. జయప్రకాష్ దర్శకత్వంలో నవీన్ ఇండ్ల మరియు కుమార్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ ను హైదరాబాద్లో విడుదల చేశారు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పాత్రలతో యువత తమను తాము పోల్చుకుంటారని నిర్మాత చెప్పారు. ఈ నెల 25న ఆడియోని మరియు నెలాఖరున చిత్రాన్ని విడుదల చెయ్యనున్నారు. కార్తిక్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Exit mobile version