తిరిగి తెర మీదకి రానున్న “తీస్కో కోకో కోలా” పాట

తిరిగి తెర మీదకి రానున్న “తీస్కో కోకో కోలా” పాట

Published on May 19, 2012 1:17 PM IST


పాత కాలపు తెలుగు చిత్రాలలో విజయం సాదించిన పాటలను రీమిక్స్ చెయ్యటం ఈ మధ్య నడుస్తున్న ట్రెండ్. ఇటీవల “రచ్చ” చిత్రంలో “వాన వాన వెల్లువాయే” పాటతో పాటు చాలా ఉదాహరణలు ఉన్నాయి. “ఎ శ్యాం గోపాల్ వర్మ ఫిలిం” సంఘమిత్ర ఆర్ట్స్ బ్యానర్ మీద నీలిమ తిరుమల శెట్టి నిర్మిస్తున్న ఈ చిత్రంలో “తీస్కో కోకో కోలా” పాటను రీమిక్స్ చేయ్యనున్నారని ప్రకటించారు. 1971లో రామకృష్ణ మరియు విజయలలిత ప్రధాన పాత్రలలో వచ్చిన “రౌడీలకు రౌడీలు” చిత్రంలోనిది ఈ పాట. సత్యం కంపోజిషన్ లో ఎల్ ఆర్ ఈశ్వరి పాడిన ఈ పాట ఇప్పటికీ ఒక సంచలనమే. ఈ పాట రీమిక్స్ విషయాన్నీ ధృవీకరిస్తూ నీలిమ ట్విట్టర్ లో ఇలా అన్నారు ” ఏ శ్యాం గోపాల్ వర్మ చిత్రంలో ఎల్ ఆర్ ఈశ్వరి పాడిన ప్రముఖ పాట ఏస్కో కోకో కోలా పాటను రీమిక్స్ చెయ్యబోతున్నాం” అని అన్నారు. మంత్ర ఆనంద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా రాకేశ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తునారు ఈ చిత్రం ఈ సంవత్సరంలోనే మొదలు కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు