కరోనా కారణంగా 16జిల్లాల్లో థియేటర్స్ బంధ్.

కరోనా కారణంగా 16జిల్లాల్లో థియేటర్స్ బంధ్.

Published on Mar 16, 2020 6:58 PM IST

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చిత్ర పరిశ్రమలు కుదేలవ్వగా మన పొరుగున ఉన్న కోలీవుడ్ సైతం విషమ పరిస్థితులను ఎదుర్కొంటుంది. తమిళనాడులో ఈ శని, ఆదివారాలలో థియేటర్స్ జనం లేక వెల వెల పోయాయి. మిగతా రోజులలో థియేటర్స్ వద్ద ప్రేక్షకులు థియేటర్స్ దగ్గర కనిపించనప్పటికీ వీకెండ్ లో అధికంగా కనిపిస్తారు. అలాంటిది కరోనా కారణంగా భిన్న పరిస్థితి కనిపించింది.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల సరిహద్దులను ఆనుకొని ఉన్న 16 జిల్లాలోని థియేటర్స్ మూసివేశారు. ఈ మహమ్మారిని నియంత్రించే చర్యల్లో భాగంగా తేనీ, కన్యాకుమారి, తిరుప్పూరు, కోయంబత్తూరు, నీలగిరి, కృష్ణగిరి, తిరునెల్వేలి, తెన్కాశి, తిరువళ్ళూరు, వేలూర్‌, తిరుపత్తూరు, రాణిపేట, ఈరోడ్‌, దిండుక్కల్‌, ధర్మపురి, విరుదునగర్‌ జిల్లాల్లోని అన్ని థియేటర్లలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇక కోలీవుడ్ స్టార్స్ విక్రమ్, కార్తీ లు నటించిన కోబ్రా, సుల్తాన్ చిత్రాల విడుదల వాయిదా వేశారు.

తాజా వార్తలు