ఈ సంవత్సరం లో తెలుగు చిత్ర సీమ లో చూడచక్కని పెళ్ళిళ్ళు జరిగాయి. అత్యంత అర్హులు అయిన యువకులు అంతా పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు. ఎన్.టి.ఆర్, రామ్ చరణ్ తేజ్, అల్లు అర్జున్ లు ఈ సంవత్సరం తమ జీవిత భాగస్వాములను పొందారు.
ఎన్.టి.ఆర్ లక్ష్మీ ప్రణతి ని పరిణయం ఆడగా అల్లు అర్జున్ స్నేహ రెడ్డి ని మనువాడారు. రామ్ చరణ్ తేజ్ తన చిన్ననాటి స్నేహితురాలు అయిన ఉపాసన కామినేని తో నిశ్చితార్ధం జరుపుకున్నారు. వీరి వేడుకలన్నీ అత్యంత ఘనం గా, చూడ చక్కని విధం గా జరిగాయి. ఈ సంవత్సరం లో జరిగిన మరొక ముఖ్య చిత్ర పరిశ్రమ పెళ్లి నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి గారి అమ్మాయి వివాహం.