హుగ్ జాక్ మాన్ మరోసారి ‘వోల్వరిన్’తో మనముందుకు రానున్నాడు. ఈ ప్రఖ్యాత సిరీస్ యొక్క కొత్త భాగం ఈ శుక్రవారం ఇండియాలో విడుదలకానుంది. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అంతటా భారీ రీతిలో విడుదలకానుంది. అయితే ఆ సమయంలో పెద్ద పోటీలేకపోవడం ఈ సినిమాకు కలిసొచ్చే అంశం
‘ది వోల్వరిన్’ మన రాష్ట్రంలో 2డి, 3డి వెర్షన్లలో విడుదలకానుంది. ఇక్కడ తెలుగు అనువాదాన్ని కుడా అదే సమయంలో విడుదలచెయ్యనున్నారు. ఈ భాగంలో కధ జపాన్ లో జరగనుంది. ఈ సీక్వెల్ లో వోల్వరిన్ మరణిస్తుందని సమాచారం
జేమ్స్ మాన్ గోల్డ్ ఈ సినిమాకు దర్శకుడు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని 20యత్ సెంచరీ ఫాక్స్ సంస్థ పంపిణిచేస్తుంది .