ఈ సంక్రాంతికి ఇద్దరు స్టార్ హీరోలు బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డారు. మహేష్ సరిలేరు నీకెవ్వరుతో రాగా, బన్నీ అలవైకుంఠపురంలో అంటూ దూకాడు. హిట్ టాక్ తెచ్చుకున్న రెండు చిత్రాలు భారీ వసూళ్లను రాబట్టాయి. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన సరిలేరు నీకెవ్వరు మహేష్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ నమోదు చేసింది. అలాగే త్రివిక్రమ్ తెరకెక్కించిన అల వైకుంఠపురంలో కూడా బన్నీ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ నమోదు చేసింది. ఇక వీరిద్దరి మధ్య కలెక్షన్స్ వార్ నడిచింది. దీనితో పోటాపోటీగా కలెక్షన్స్ పోస్టర్స్ విడుదల చేశారు, విజయోత్సవ వేడుకలు జరిపారు.
ఐతే ఈ పోటీ ముగిసిపోలేదు…వెండితెరపై వార్ అయిపోయినప్పటికీ బుల్లితెర వార్ మిగిలే ఉంది. ఈ ఉగాదికి జెమినీ టీవీలో ప్రసారమైన సరిలేరు నీకెవ్వరు ఆల్ టైం టాప్ టీఆర్పీ అందుకొని రికార్డు నెలకొల్పింది. 23.4 టీఆర్పీ దక్కించుకున్న ఈ చిత్రం గతంలో అత్యధిక టీఆర్పీ సాధించిన చిత్రంగా ఉన్న బాహుబలి 2ని కూడా మించిపోయింది. బన్నీ అల వైకుంఠపురంలో చిత్ర శాటిలైట్ రైట్స్ కూడా దక్కించుకున్న జెమినీ మే 1న ఈ మూవీని ప్రసారం చేయనుంది. మరి ఈ చిత్రం ఎంతటి టీఆర్పీ అందుకోనుంది అనేది ఆసక్తికరంగా మారింది. మరి చూడాలి బన్నీ బుల్లితెరపై మహేష్ ని అధిగమిస్తాడో లేదో..?