పవన్ కళ్యాణ్ ని ఆలోచింపజేసే 3 విషయాలు

పవన్ కళ్యాణ్ ని ఆలోచింపజేసే 3 విషయాలు

Published on Dec 2, 2013 8:49 AM IST

Pawan_Kalyan-10
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కాస్త ప్రైవేట్ గా ఉండే వ్యక్తిత్వం కలిగిన వాడు. ఆయన మైండ్ లో ఎప్పుడు ఎం రన్ అవుతోంది అని గుర్తించడం కాస్త కష్టమైన పని. ఆయన ఓ ప్రముఖ పత్రికకి ఇచ్చిన చిన్న బైట్ లో పవన్ కళ్యాణ్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పేర్కొన్నాడు. పవన్ కళ్యాణ్ తన మైండ్ ఎక్కువ టైం 3 విషయాలతో నిండిపోయి ఉంటుందని అవే ప్రకృతి, పిలాసఫీ మరియు సామాజిక సమస్యలు.

అలాగే ఆయన కోపం గురించి అడిగినప్పుడు ‘ అవసరమైనంత వరకు వయొలెన్స్ ఉండాలనేది నమ్ముతాను కానీ అనవసరమైన దానికల్లా వయొలెన్స్ ఉండకూడదని’ పవన్ కళ్యాణ్ అన్నాడు. దీనికి ఓ ఉదాహరణ చెబుతూ ‘ మీ ఇంట్లోకి ఒక దొంగ వస్తే మీరు చేతులు కట్టుకొని అతనికి మర్యాదలు చేస్తారా లేక అతన్ని పట్టుకొని కొడతారా?’ అని చమత్కారంగా ఉదాహరణ ఇచ్చాడు. అలాంటి సందర్భాల్లో మన మనస్సాక్షిని బట్టి రియాక్ట్ అవుతారని పవన్ తెలిపాడు.

అలాగే మీరు మళ్ళీ రాజకీయాల్లోకి వస్తున్నారా అని అడిగిన ప్రశ్నకి పవన్ సమాధానమిస్తూ ‘ నేను రాజకీయాలకి దూరంగా ఉంటే కదా మళ్ళీ రాజకీయాల్లోకి రావడానికని’ ఆన్నారు.

తాజా వార్తలు