నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ పై బాలయ్య అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గా ‘ఇఫి’ వేడుకల్లో కూడా ఈ విషయం గురించి బాలకృష్ణ చెబుతూ.. తన ‘ఆదిత్య 369’కి కొనసాగింపుగా రూపొందనున్న ‘ఆదిత్య 999 మ్యాక్స్’తోనే మోక్షజ్ఞ కథానాయకుడిగా పరిచయం కానున్నట్టు క్లారిటీ ఇచ్చారు. కాగా ఈ సినిమాని ప్రముఖ దర్శకుడు క్రిష్ తెరకెక్కించనున్నట్టు టాక్ నడుస్తోంది. దర్శకుడు క్రిష్ తో కలిసి రచయిత సాయి మాధవ్ బుర్రా ఈ సినిమా స్క్రిప్ట్ పై వర్క్ చేశారు.
ఐతే, తాజాగా ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తి అయిందని.. బాలయ్య కూడా స్క్రిప్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. అన్నట్టు ఈ సినిమా కథ దాదాపు బాలయ్య ఆలోచనలతోనే సాయి మాధవ్ బుర్రా పూర్తి చేశారని తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరి ఎండింగ్ లో ఈ సినిమాని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఐతే, ఈ వార్త పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఆ మధ్య తన వారసుడి ఎంట్రీ పై బాలయ్య మాట్లాడుతూ.. ‘మోక్షజ్ఞను ఎలా ఇంట్రడ్యూస్ చేయాలో నాకు తెలుసు. మోక్షజ్ఞ కోసం ఒక ఐదు ఆరు స్క్రిప్ట్స్ నా మైండ్ లోనే రెడీగా ఉన్నాయి’ అని బాలయ్య చెప్పుకొచ్చారు.
