‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ నుంచి రెండో పాట రిలీజ్ డేట్ ఫిక్స్ !

Bhartha Mahasayulaku Wignya

మాస్ మహారాజా రవితేజ హీరోగా దర్శకుడు కిషోర్ తిరుమల డైరెక్షన్‌లో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ సాంగ్‌గా ‘బెల్లా బెల్లా’ అనే పాటను రిలీజ్ చేశారు. ఈ పాట ఆద్యంతం క్యాచీ ట్యూన్స్‌తో ఆకట్టుకుంటుంది. ఇప్పుడు రెండో పాట కూడా రాబోతుంది. ‘అద్ధం ముందు’ అంటూ రాబోతున్న ఈ పాటలో రవితేజ – డింపుల్ హయతి నటించనున్నారు. కాగా ఈ పాట విడుదల తేదీని ప్రకటిస్తూ.. ఒక పోస్టర్ ను విడుదల చేశారు.

కాగా ఈ పాట డిసెంబర్ 10, 2025న రిలీజ్ కాబోతుంది. ఇక ఈ రోజు సాయంత్రం 6:03 గంటలకు ఈ పాట ప్రోమో వస్తుంది. అన్నట్టు ఈ సినిమా డిజిటల్ మరియు శాటిలైట్ డీల్స్ కూడా పూర్తి అయ్యాయి. జీ గ్రూప్ భారీ మొత్తానికి ఈ సినిమా హక్కులను సొంతం చేసుకుంది. జీ 5 ఈ చిత్రాన్ని ప్రసారం చేయనుంది. జీ తెలుగు మరియు జీ సినిమా ఈ సినిమాని ప్రసారం చేయనుంది. జీ స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్‌ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు.

Exit mobile version