పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘ది రాజాసాబ్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు మారుతి తనదైన టేకింగ్‌తో హారర్ కామెడీ జోనర్‌గా రూపొందించారు. ఇక ఈ సినిమా నుంచి తాజాగా బిగ్ అప్డేట్ ఇస్తూ ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ ట్రైలర్ కట్‌లో ఆద్యంతం వింటేజ్ డార్లింగ్ మనకు కనిపిస్తున్నాడు. ప్రభాస్‌ను అభిమానులు ఇలాంటి తరహా పాత్రలో చూసేందుకు కొన్నేళ్లుగా వెయిట్ చేస్తున్నారు. ఈ ట్రైలర్‌తో వారి ఎదురుచూపులకు తెరపడింది. ఇక ప్రభాస్ ఈ ట్రైలర్‌లో వన్ మ్యాన్ షో పర్ఫార్మెన్స్‌ను ఇచ్చాడు. మారుతి టేకింగ్‌లో హారర్ ఎలిమెంట్స్ కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నట్లు ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
ప్రభాస్‌తో కేవలం కామెడీ, రొమాన్స్ మాత్రమే కాకుండా పవర్‌ఫుల్ డైలాగ్స్, అదిరిపోయే యాక్షన్ కూడా మనకు అందించనుంది ‘ది రాజాసాబ్’ మూవీ. ఓవరాల్‌గా ఈ సినిమాతో రెబల్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్‌ను రెడీ చేస్తున్నారు మారుతి అండ్ టీమ్. ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, సంజయ్ దత్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ థండరింగ్ మ్యూజిక్‌తో రూపొందిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై టిజి.విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని 2026 జనవరి 9న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి