‘ది రాజా సాబ్’ ఫస్ట్ ట్రైలర్ రన్ టైం లాక్.. ఆల్ సెట్

‘ది రాజా సాబ్’ ఫస్ట్ ట్రైలర్ రన్ టైం లాక్.. ఆల్ సెట్

Published on Sep 25, 2025 1:00 PM IST

The-Raja-Saab

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతీ కాంబినేషన్ లో చేస్తున్న సాలిడ్ హారర్ ఫాంటసీ ఎంటర్టైనర్ చిత్రం ది రాజా సాబ్ కోసం అందరికీ తెలిసిందే. ప్రభాస్ నుంచి చాలా కాలం తర్వాత ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ లో మంచి హైప్ దీని పట్ల ఉంది. ఇక ఈ సినిమా తాలూకా ట్రైలర్ ని మేకర్స్ ఈ అక్టోబర్ లోనే రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ ట్రైలర్ కి రన్ టైం లాక్ అయినట్టుగా తెలుస్తుంది. దీనితో రాజా సాబ్ మొదటి ట్రైలర్ 3 నిమిషాలకి పైగానే నిడివితో రాబోతున్నట్టుగా ఇపుడు కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది. ఇక దీనితో పాటుగా ఈ అక్టోబర్ రెండో తారీఖున భారీ చిత్రం కాంతార 1 తో థియేటర్స్ లో సందడి చేసేందుకు సిద్ధం అయినట్టుగా కూడా ఇపుడు టాక్. మరి అఫీషియల్ అనౌన్సమెంట్ ఒకటి దీనిపై రావాల్సి ఉందని చెప్పాలి.

తాజా వార్తలు